పలమనేరు: ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం

పలమనేరులో శనివారం ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. గంగ జాతర సందర్భంగా దుకాణదారులు ఏర్పాటు చేసుకున్న ఫాన్సీ, బొమ్మల దుకాణదారులు శుక్ర, శనివారం కురిసిన వర్షం వల్ల వస్తువులన్నీ తడవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈదురు గాలి, పిడుగులతో ప్రజలు భయపడి ఇళ్లకే పరిమితమయ్యారు. ఉదయం నుంచి ఎండ కాసి సాయంత్రం వర్షం కురవడంతో కొంత ఉపశమనం కలిగిందని ప్రజలు అన్నారు.

సంబంధిత పోస్ట్