పలమనేరుకు చెందిన ఓ యువకుడు కర్ణాటక రాష్ట్రం ముళబాగల్లో అనుమానాస్పద స్థితిలో ఆదివారం మృతి చెందాడు. గంటవూరు ఇందిరమ్మ కాలనీకి చెందిన శివారెడ్డి అలియాస్ రెడ్డి ముళబాగల్లోని ఓ ప్రైవేటు లాడ్జిలో సృహ లేకుండా పడి ఉన్నాడు. గమనించిన నిర్వాహకులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పోలీసుల దర్యాప్తులో నిజానిజాలు తెలియాల్సి ఉంది.