అభివృద్ధికి చిరునామాగా రాయలసీమ:ఎమ్మెల్యే అమరనాథ్ రెడ్డి

పలమనేరులో శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే అమరనాథ్ రెడ్డి మాట్లాడుతూ ఒకప్పుడు కరువు, వలసలకు నెలవైన రాయలసీమ నేడు పెట్టుబడులు, పరిశ్రమలకు కేంద్రంగా మారిందని తెలిపారు. రెండేళ్ల కూటమి పాలనలో రాయలసీమకు ₹4.58 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, 2.76 లక్షల ఉద్యోగాల కల్పనకు శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. కడప ఉక్కు పరిశ్రమ పునఃప్రారంభం, మిషన్ రాయలసీమతో లక్ష కోట్ల అభివృద్ధి ప్రణాళిక, హంద్రీ-నీవా ప్రాజెక్టుకు ₹3,873 కోట్లతో సాగునీరు అందించడం వంటి అభివృద్ధి పనులు జరిగాయని తెలిపారు. రాయలసీమను రాయల్ సీమగా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఆయన అన్నారు.

సంబంధిత పోస్ట్