పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథరెడ్డిని ఆయన నివాసంలో ఉంగుటూరు ఎమ్మెల్యే, జనసేన పార్టీ జిల్లా అబ్జర్వర్ ధర్మరాజు మర్యాదపూర్వకంగా ఆదివారం కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్ర రాజకీయాలు, జిల్లాలో పార్టీ బలోపేతం, కూటమి ప్రభుత్వ సంక్షేమ–అభివృద్ధి కార్యక్రమాల అమలు, ప్రజలకు ప్రభుత్వ పథకాలు మరింత సమర్థవంతంగా చేరేలా తీసుకోవాల్సిన చర్యలపై ఇరువురు నేతలు చర్చించారు. అంతకుముందు ధర్మరాజు పలమనేరు మండలం ముసలిమడుగు ఎలిఫెంట్ క్యాంపును సందర్శించి, ఏనుగుల సంరక్షణ, సహజ వాతావరణాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎడ్యుకేషనల్ కార్పొరేషన్ డైరెక్టర్ ఉయ్యాల శ్రీనివాసులు, జనసేన నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.