చిత్తూరు జిల్లా పలమనేరు మండలంలోని కొలమాసనపల్లి గ్రామంలో ఈనెల 14వ తేదీలోపు ఓటు నమోదు కార్యక్రమాన్ని పూర్తి చేయనున్నట్లు పంచాయతీ కార్యదర్శి ఉదయ్ భాస్కర్ సోమవారం తెలిపారు. ఈ ప్రక్రియలో ఏడుగురు బిఎల్‌ఓలు పాల్గొంటున్నారని, పూర్తిస్థాయిలో ఓటర్ల నమోదు కోసం వేగవంతం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బిఎల్‌ఓలతో పాటు పలువురు పాల్గొన్నారు.