కలికిరి మండలంలోని కలకడ రోడ్డు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గురువారం ఓ వ్యక్తి మరణించాడు. సోమల మండలానికి చెందిన కృష్ణయ్య బైక్ పై వెళ్తుండగా కారు ఢీకొట్టింది. కృష్ణయ్యకు తీవ్ర గాయాలు కావడంతో పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా మరణించాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కలికిరి ఎస్ఐ రెడ్డి శేఖర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.