బంగారుపాళ్యంలో డా. శ్యామా ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి వేడుకలు

భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు డా. శ్యామా ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి సందర్భంగా బంగారుపాళ్యం మండల బిజెపి ఆధ్వర్యంలో ఘనంగా పుష్పాంజలి కార్యక్రమం నిర్వహించారు. బంగారుపాళ్యం మండల కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో, నియోజకవర్గ ఇన్‌చార్జ్ భాను ప్రకాష్ ముఖర్జీ త్యాగాలు, దేశ సమైక్యత కోసం ఆయన చేసిన కృషిని గుర్తుచేసుకున్నారు. "ఒక దేశం, ఒక జెండా, ఒక చట్టం" అనే ఆయన ఆశయాలు నేటికీ బిజెపి కార్యకర్తలకు స్ఫూర్తి అని అన్నారు. ముఖర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

సంబంధిత పోస్ట్