విద్యుత్ షాక్ తాత, మనవడు మృతి

చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం గుండ్లకట్టమంచి హరిజనవాడలో కరెంటు షాక్ తో తాత, మనవడు మృతి చెందిన ఘటన గురువారం చోటు చేసుకుంది. కె. నాగయ్య (73) ఇంట్లో ఉయ్యాల ఊగుతుండగా విద్యుత్ షాక్ తగలడంతో కింద పడబోయాడు. ఆయనను మనవడు రాజ్ కుమార్ (22 ) వెళ్లి పట్టుకోవడంతో అతనికి కూడా విద్యుత్ షాక్ తగిలింది. ఇద్దరిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందారని వైద్యులు తెలిపారు.

సంబంధిత పోస్ట్