పూతలపట్టు మండల కేంద్రం పూతలపట్టులో శనివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి ఉక్కపోతగా ఉండగా సాయంత్రం నుంచి ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. కొన్ని రోజులుగా తీవ్ర ఉక్కపోతకు గురైన ప్రజలు వర్షంతో ఉపశమనం పొందారు. వాహనదారులు కాస్త ఇబ్బంది పడ్డారు. వర్షానికి రైతులు సైతం ఇబ్బందులు పడ్డారు.