చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలంలోని ఎన్టీఆర్ జలాశయం వెనుక ప్రాంతంలోని పాత బ్రిడ్జి వద్ద గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైనట్లు ఆదివారం పోలీసులు తెలిపారు. మృతురాలు వయసు సుమారు 50 ఏళ్లు ఉంటుందన్నారు. రెండు చేతులకు పచ్చబొట్టు ఉందని తెలిపారు. మహిళ ఆచూకీ ఎవరికైనా తెలిస్తే పూతలపట్టు పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.