చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలంలో బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల మేరకు, బెంగళూరు నుంచి ఓ కారు తిరుపతికి బయల్దేరింది. పాలకూరు వద్దకు రాగానే హైవేపై ఓ లారీ అదే మార్గంలో కారు పక్కనే వేగంగా వచ్చింది. దానిని తప్పించే క్రమంలో కారు డివైడర్ను ఢీకొని బోల్తాపడింది. కారులో ఉన్నవారికి ఎలాంటి గాయాలు కాలేదు.