హైవేపై నిలిపి ఉంచిన లారీని వేగంగా మరో లారీ ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందిన ఘటన పూతలపట్టు మండలం కొత్తకోట సమీపంలో మంగళవారం చోటుచేసుకుంది. కొత్తకోట సమీపంలో ఆరు లైన్ల రహదారిలో రోడ్డులో ఆపి ఉన్న లారీని ఢీకొడంతో డ్రైవర్, క్లీనర్ ఇద్దరు ఘటన స్థలంలో మృతి చెందారు. సమాచారం అందుకున్న పూతలపట్టు పోలీసులు అక్కడికి చేరుకుని ట్రాఫిక్ నియంత్రించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.