చిత్తూరు జిల్లా పుంగనూరులో అగ్నిమాపక వారోత్సవాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మంగళవారం పట్టణంలోని అంబేడ్కర్ కూడలిలో అగ్నిమాపక సిబ్బంది ప్రదర్శించిన విన్యాసాలు ప్రజలను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అనంతరం ఫైర్ ఆఫీసర్ సుబ్బరాజు అగ్నిప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రజలు ఎవరైనా ప్రమాదాలను గుర్తించినట్లయితే వెంటనే 85004 45101కు ఫోన్ చేసి వివరాలు తెలియజేయాలని చెప్పారు.