చిత్తూరు జిల్లా, పుంగనూరు నియోజకవర్గం సదుం మండలంలో శనివారం తెల్లవారుజామున ఏనుగులు హల్ చల్ చేశాయి. మండలంలోని మార్తువారిపల్లెలో రైతులు జనార్దన్ రెడ్డి, చంద్రమ్మ, కృష్ణమ్మ, రెడ్డెప్ప, రెడ్డిలకు చెందిన వరి, చెరుకు పంటలను ధ్వంసం చేశాయి. మండలంలో ఎప్పుడు ఏనుగుల బెడద తమకు తప్పుతుందని రైతులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. అటవీ శాఖ అధికారులు తమను ఆదుకోవాలని బాధితులు కోరుకుంటున్నారు.