చిత్తూరు జిల్లా, పుంగనూరు పట్టణ పరిధిలోని టీవీఎస్ షోరూం వద్ద వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా మండల కన్వీనర్ కుమార్ సొంత పనుల నిమిత్తం పట్టణానికి వచ్చి తిరిగి తమ గ్రామం కమతంపల్లికు శనివారం మధ్యాహ్నం ఒక గంట ప్రాంతంలో వెళుతుండగా. మదనపల్లి నుంచి వస్తున్న కారు ఢీకొనడంతో కుమార్ తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడ్డ కుమార్ ను స్థానికులు పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.