చిత్తూరు జిల్లా, పుంగనూరు నియోజకవర్గం పులిచెర్ల మండలంలో పంటలను ధ్వంసం చేస్తున్న ఏనుగుల గుంపు మంగళవారం తెల్లవారుజామున పశ్చిమ భాగం అటవీ ప్రాంతం నుంచి తూర్పు భాగం అటవీ ప్రాంత పరిధిలోకి దాటుకున్నాయి. ఈ క్రమంలో అటవీ సమీప ప్రాంతంలోని మామిడి చెట్లను ధ్వంసం చేసినట్లు అటవీశాఖ అధికారి మహమ్మద్ షఫీ తెలియజేశారు. ఏనుగుల సంచారం ఎక్కువగా ఉండడంతో కల్లూరు సమీప ప్రాంతంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారి హెచ్చరించారు.