చిత్తూరు జిల్లా పుంగనూరు మండల సమీపంలోని వేయింగ్ బ్రిడ్జి వద్ద శనివారం మధ్యాహ్నం యాక్సిడెంట్ జరిగింది. పుంగనూరు పట్టణం తూర్పు మొగసాలకు చెందిన రాజశేఖర్( 35 ) ద్విచక్ర వాహనంలో పుంగునూరు వస్తుండగా ఎదురుగా వస్తున్న బొలెరో వాహనం ఢీకొనడంతో రాజశేఖర్ త్రివంగా గాయపడ్డాడు. అతడిని 1033 హైవే అంబులెన్స్ సిబ్బంది ఏరియా ఆస్పత్రికి తరలించగా ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు.