కారు ఢీకొని ఓ వ్యక్తి గాయపడ్డ ఘటన పుంగనూరు మండలంలో మంగళవారం సాయంత్రం జరిగింది. 108 వాహన సిబ్బంది గోవర్ధన్, జాషువా వివరాల మేరకు గాంధీపురం గ్రామానికి చెందిన గంగులప్ప ద్విచక్ర వాహనం మీద పుంగనూరుకు వస్తుండగా భీమగాని పల్లి సమీపంలో ఓ కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో గంగులప్ప గాయపడగా కారు ఆగకుండా వేగంగా వెళ్లిపోయింది. గాయపడ్డ అతడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.