పుంగనూరు మండల పరిధిలోని సుగాలి మిట్ట వద్ద కారును ఐచర్ వాహనం ఢీకొన్న ఘటన ఆదివారం మధ్యాహ్నం జరిగింది. స్థానికుల వివరాలు మేరకు గాయపడిన వారు కలకడ మండలం ఎర్రయ్య గారి పల్లికి చెందిన వెంకటరమణ, సరదా, కీర్తి గా గుర్తించారు. క్షతగాత్రులని మదనపల్లి ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో శారద మృతి చెందింది. గాయపడిన వారికి మెరుగైన చికిత్సను అందించడానికి బెంగళూరుకు తరలించారు.