గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలంలో శుక్రవారం జరిగింది. స్థానికుల వివరాలు మేరకు మండలంలోని యానాది కాలనీకి చెందిన రెడ్డప్ప (35) చౌడేపల్లి కి వెళ్లడానికి రోడ్డు పక్కన నిలుచుకొని ఉండగా పుంగనూరు నుంచి తిరుపతి వెళుతున్న ఓ వాహనం రెడ్డప్పను ఎల్లకుంట్ల వద్ద ఢీకొంది. ఈ ఘటనలో బాధితుడు అక్కడికక్కడే మృతి చెందాడు.