చిత్తూరు జిల్లా, పుంగనూరు మండలంలోని నరసాపురం వద్ద గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. కడప జిల్లా మైదుకూరు పట్టణానికి చెందిన చెన్నకేశవులు (42) ద్విచక్ర వాహనంపై మదనపల్లికి వెళ్తుండగా నరసాపురం గ్రామం వద్ద కుక్క అడ్డం రావడంతో ద్విచక్ర వాహనం బోల్తా పడి చెన్నకేశవులు కాలు విరిగిపోయింది. వెంటనే స్థానికులు 108 సిబ్బందికి సమాచారం అందించి గాయపడ్డ చెన్నకేశవలను పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు.