చిత్తూరు జిల్లా, పుంగనూరు పట్టణం మేలుపట్లలో కాపురం ఉంటున్న షఫీ భార్య సఫీయా. బుధవారం రాత్రి ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి కుటుంబీకులు భర్త షఫీపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని శవ పంచనామా నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఈ ఘటన గురువారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.