పుంగనూరు నియోజకవర్గం, సోమల మండలం, నెల్లిమంద వద్ద శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల మేరకు సోమల నుంచి కందూరు వైపు గుర్తుతెలియని వ్యక్తి వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం అతనిని ఢీకొనడంతో అతని తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వ్యక్తిని గుర్తించిన 104 సిబ్బంది శ్రీకాంత్ 108 కి సమాచారం అందించి కందూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.