సచివాలయానికి వచ్చే ప్రజల సమస్యలను సిబ్బంది సకాలంలో పరిష్కరించాలని మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ అలీమ్ భాష తెలియజేశారు. ఈ సందర్భంగా శుక్రవారం పట్టణంలోని తూర్పు మొగసాల 1, 2 సచివాలయాలను తనిఖీ చేశారు. పలు రికార్డులను పరిశీలించారు. అనంతరం ప్రజలకు అందిస్తున్న సేవల ను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.