అక్రమ సంబంధం వివాదంలో ఇద్దరికి గాయాలైన ఘటన శుక్రవారం పుంగనూరు మండల పరిధిలో జరిగింది. వివరాలులో కెళ్తే మండలానికి చెందిన పెద్ద తండాలో కాపురం ఉంటున్న లేట్ సురేంద్రనాయక్ భార్య గత కొంతకాలంగా గడిదేసి గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఈ నేపథ్యంలో వరుసకు పెద్ద మామ అయిన దొరస్వామి కోడలను ఇలా చేరాదని హెచ్చరించారు. దీనితో కక్ష పెంచుకున్న రెడ్డప్ప దొరస్వామిపై శుక్రవారం దాడి చేశాడు.