చిత్తూరు జిల్లా, పుంగనూరు మండలం , గోపీశెట్టిపల్లి గ్రామంలో సోమవారం వ్యవసాయ పొలం భూ వివాదంలో మాట మాట పెరిగి లక్ష్మీ నారాయణ (40), వెంకటప్ప (62)ఇరువురు గొడవపడి గాయపడ్డారు. గాయపడిన వారిని కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించి. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది.