చిత్తూరు జిల్లా, పుంగనూరు మండల పరిధిలోని గుట్టపల్లికి చెందిన బి. పవన్( 21) మనస్థాపం చెంది గ్రామ సమీపంలో పంట పొలాల్లో గడ్డి మందు తాగి శుక్రవారం ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించగా కుటుంబ సభ్యులు పుంగనూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్సలు నిర్వహించి పవన్ పరిస్థితి విషమం ఉండడంతో వైద్యుల సిఫారసు మేరకు తిరుపతికి తరలించగా అత్యవసర విభాగం లో చికిత్స పొందుతూ పవన్ శనివారంమృతి చెందాడు.