పిచ్చాటూరు ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలోని నాగలాపురం 1 అంగన్వాడి కేంద్రంలో జాతీయ తల్లిపాల వారోత్సవాలు గురువారం సూపర్వైజర్ శ్రీదేవి ఆధ్వర్యంలో జరిగాయి. ఆమె మాట్లాడుతూ. బిడ్డ పుట్టిన వెంటనే తల్లి పాలు బిడ్డకు పట్టడం వలన వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని అన్నారు. ముర్రు పాలు బిడ్డకు దివ్య ఔషధం లాంటిదని అన్నారు. 100 రోజుల స్పెషల్ అవేర్నెస్ లో భాగంగా బేటి బచావో బేటి పడావో పై అవగాహన కల్పించారు.