సదుం మండలంలో రోడ్డు ప్రమాదం

పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలంలో ఆదివారం మామిడి కాయలు తరలిస్తున్న ట్రాక్టర్ బోల్తా పడింది. పాల డైరీ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ట్రాక్టర్ వెనుక టైరు బేరింగ్ ఊడిపోవడంతో వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కన పడిపోయింది. దీనితో ట్రాక్టర్లో ఉన్న మామిడి కాయలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం సంభవించకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

సంబంధిత పోస్ట్