సత్యవేడు నియోజకవర్గానికి తుడా నిధులు కేటాయించి మౌలిక వసతుల అభివృద్ధి చేపట్టాలని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డిని కోరారు. శనివారం తిరుపతిలోని తుడా కార్యాలయంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలసి ఘనంగా సత్కరించారు. అనంతరం సత్యవేడు అభివృద్ధిపై చర్చించారు. ప్రతిస్పందించిన చైర్మన్ దివాకర్ రెడ్డి, ప్రణాళికాబద్ధంగా ప్రతిపాదనలు పంపితే నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.