తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం బుచ్చినాయుడు కండ్రిగ మండలం వెస్ట్ వరత్తూరు సమీపంలో గురువారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైకును కంటైనర్ ఢీకొన్న ప్రమాదంలో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.