సుప్రీంకోర్టు తీర్పు మేరకు అంగన్వాడీ కార్యకర్తలకు గ్రాట్యుటీఅమలు చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు రమేష్ కోరారు. అఖిలభారత కోర్కెల దినోత్సవం పురస్కరించుకొని పలు సమస్యలపై అంగన్వాడి కార్యకర్తలు బుధవారం సత్యవేడు తహసిల్దార్ కార్యాలయం ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ అంగన్వాడీ కార్యకర్తలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలన్నారు.