కంటైనర్ ఢీకొనడంతో వ్యక్తి మృతి

నాగలాపురం మండల పరిధిలోని బయట కొడియం బేడు వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కంటైనర్ ఢీకొనడంతో అదే గ్రామానికి చెందిన సెల్వం అనే వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటనతో ఆగ్రహించిన గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు. తరచూ ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ అధికారులు స్పీడ్ బ్రేకర్ ఏర్పాటు చేయడంలో విఫలమయ్యారని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్