పిచ్చాటూరు: వడ దెబ్బతో వ్యక్తి మృతి

పిచ్చాటూరు మండలం కీలపూడికి చెందిన పేరయ్య (55) అరనియార్ చెరువులో ఆవులను మేపడానికి వెళ్లగా, తీవ్రమైన ఎండ ధాటికి స్పృహ తప్పి పడిపోయారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందడంతో, అతన్ని ఆసుపత్రికి తరలించారు. అయితే, ఆసుపత్రికి చేరుకునే లోపే పేరయ్య మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

సంబంధిత పోస్ట్