పిచ్చాటూరు మండలం రామగిరిలోని శ్రీవాలీశ్వరస్వామి ఆలయాన్ని ఆదివారం తొలి ఏకాదశి సందర్భంగా కంచి కామకోటి పీఠాధిపతి శ్రీసత్య చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి దర్శించుకున్నారు. అర్చకులు శంకరరాజ్ గురుక్కళ్ స్వాగతం పలికారు. స్వామివారు వాలీశ్వరస్వామి, కాళ భైరవస్వామి, మరగదాంబిగమ్మవారిని దర్శించారు. పుష్కరిణీలో నంది తీర్థాన్ని సేవించారు. ఆలయం గొప్ప విశిష్టత కలదని, నిర్వహణ ప్రశంసనీయం అని స్వామివారు అన్నారు.