సత్యవేడు: నేడు విద్యుత్ సరఫరా నిలిపివేత

తిరుపతి జిల్లా సత్యవేడు, దాసుకుప్పం విద్యుత్ సబ్స్టేషన్ పరిధిలో శనివారం విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్టు సంబంధిత విద్యుత్ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒక గంట వరకు విద్యుత్ సరఫరా ఉండదన్నారు. సబ్స్టేషన్ నిర్వహణ, విద్యుత్ స్తంభాల వద్ద చెట్లు తొలగింపు వంటి పనులు చేయడానికి విద్యుత్ సరఫరాను నిలిపిస్తున్నామన్నారు. దీన్ని విద్యుత్ వినియోగదారులందరూ గమనించి సహకరించాలన్నారు.

సంబంధిత పోస్ట్