తిరుపతి జిల్లా సత్యవేడు పట్టణంలోని బేరి శెట్టి కళ్యాణ మండపంలో ఆదివారం వైసీపీ ఆత్మీయ సమావేశం జరుగుతుందని వైసీపీ సమన్వయకర్త నూక తోటి రాజేశ్ కార్యాలయం శుక్రవారం రాత్రి తెలిపింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైసీపీ అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి హాజరవుతారని తెలిపారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.