తిరుపతి: బాలుడి ప్రాణం తీసిన విష జ్వరం

కేవీబీ పురం మండలం పూడి చెన్నకేశవపురం గ్రామానికి చెందిన 14 సంవత్సరాల ఉదయ్ కుమార్ అనే బాలుడికి గతవారంలో విష జ్వరం వ్యాపించింది. అదే సమయంలో ఎం.ఏ. రాజుల కండ్రిగ పూడి చెన్నకేశవపురం రోడ్డులోని వాగు దాటలేకపోవడంతో ఇంటిలోనే వైద్యం అందించారు. విష జ్వరం తీవ్రత పెరిగి మంగళవారం మరణించాడు. ఆ రోడ్డులోని నాలుగు ఊర్ల ప్రజలు బ్రిడ్జ్ నిర్మించాలంటూ అధికారులను వేడుకుంటున్నారు.

సంబంధిత పోస్ట్