శ్రీకాళహస్తి: హైవేపై ప్రమాదం.. మహిళా కమిషన్ సభ్యురాలికి గాయాలు

శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టంబేడు పరిధి పొయ్య గ్రామం సమీపంలో ఆదివారం బైకు-స్కార్పియో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బైకు మీద ప్రయాణిస్తున్న వ్యక్తితోపాటూ స్కార్పియోలో ప్రయాణిస్తున్న ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ సభ్యురాలు రూకియా బేగంకు గాయాలయ్యాయి. వారిని శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్