శ్రీకాళహస్తి హైవేపై నాయుడుపేట వైపు వెళ్తున్న కారు రాచగున్నేరి వద్ద లాంకో ఫ్యాక్టరీ సమీపంలో ప్రమాదానికి గురైంది. వేగంగా వస్తున్న కారు అకస్మాత్తుగా రోడ్డుపైకి వచ్చిన ఆవును ఢీకొట్టడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఆవు అక్కడికక్కడే మృతి చెందగా, కారులో ప్రయాణిస్తున్న వారికి ఎలాంటి గాయాలు కాలేదు. సమాచారం అందిన వెంటనే హైవే సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు.