తొట్టంబేడు రోడ్డుపై ప్రమాదం

తొట్టంబేడు మండలం సింగమల గ్రామం హైవే బ్రిడ్జి వద్ద స్కూటర్ను మినీ వ్యాన్ ఢీకొట్టినట్లు బుధవారం స్థానికులు తెలిపారు. సింగమల గ్రామానికి చెందిన గంగయ్య (48)సొంత పనుల నిమిత్తం శ్రీకాళహస్తి వస్తుండగా నాయుడుపేట వైపు వెళ్తున్న మినీ వ్యాన్ ఢీకొట్టింది. దీంతో గంగయ్య కు కాలు విరిగింది. స్థానికులు 108 ద్వారా ఆయన్ను శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రికి తరలించారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్