శ్రీకాళహస్తిలో రోడ్డు ప్రమాదం గుర్తు తెలియని వ్యక్తి మృతి

శ్రీకాళహస్తి మండలంలోని ఉరందూరు హైవే బ్రిడ్జిపై సోమవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి ఆగిపోకుండా వెళ్లిపోయిందని స్థానికులు తెలిపారు. ప్రమాద తీవ్రత కారణంగా మృతదేహం నుజ్జునుజ్జు కావడంతో మృతుడిని గుర్తించడం కష్టంగా మారింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్