ముక్కంటి సన్నిధిలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి శ్రీ తుహిన్ కుమార్ గెడెలా శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానాన్ని ఆదివారం సందర్శించారు. ఆయన శ్రీ స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక ఆశీర్వాదాలు పొందారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీ బి. కె. వెంకటేశులు, ప్రోటోకాల్ ఏఈఓ శ్రీ లోకేష్ బాబు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి, దర్శన ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ శ్రీ విద్యాసాగర్ రెడ్డి, ఆలయ పర్యవేక్షకులు శ్రీ సి. నాగభూషణం యాదవ్, కోర్టు పర్యవేక్షకులు శ్రీ రవి, పి. పి సుబ్రమణ్యం పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్