రేణిగుంటలో గంజాయి మత్తులో కారుపై దాడికి యత్నం

రేణిగుంట పట్టణంలో గురువారం గంజాయి మత్తులో ఉన్న యువకుడు నిలిపి ఉంచిన కారుపై రాయి విసిరి దాడికి యత్నించాడు. కారు యజమాని అడ్డుకోవడంతో స్థానికులు చేరుకునే సరికే యువకుడు పరారయ్యాడు. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. రేణిగుంట పరిసరాల్లో గంజాయి సాగు, విక్రయాలు, వ్యసనపరుల ఆగడాలు పెరిగిపోతున్నాయని, పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్