పవన్ కళ్యాణ్ పుట్టినరోజున విద్యార్థులకు పుస్తకాలు, స్నాక్స్ పంపిణీ

ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని, స్వేచ్ఛ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పేడు మండలం ఆర్. వి. కండ్రిగలో విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు, స్నాక్స్ బుధవారం పంపిణీ చేశారు. చిన్నారుల్లో చదువు పట్ల ఆసక్తి పెంచి, వారి విద్యాభివృద్ధికి తోడ్పడటమే తమ సంస్థ ప్రధాన లక్ష్యమని ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు వంశీ యాదవ్ తెలిపారు. భవిష్యత్తులోనూ మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వాలంటీర్ దిలీప్, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. విద్యా సామగ్రి అందుకున్న విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్