అత్తూరు పంచాయతీ అమ్మవారిపట్టెడ అంగన్వాడీ కేంద్రంలో 'జాతీయ పోషణ్ మా' అవగాహన సదస్సు శనివారం జరిగింది. రేణిగుంట PHC హెల్త్ సూపర్వైజర్ కామరాజు మాట్లాడుతూ గర్భిణులు, బాలింతలు, చిన్నారులు తమ ఆహారంలో ఆకుకూరలు, గుడ్లు, పాలు, పండ్లు వంటి సమతుల్య పోషకాహారం తీసుకోవాలని సూచించారు. శిశువులకు తొలి ఆరు నెలలు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని, రక్తహీనత నివారణకు టీనేజర్లు ఐరన్ మాత్రలు వాడాలని పేర్కొన్నారు. పరిశుభ్రత పాటిస్తూ అంగన్వాడీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్ అనంతలక్ష్మి, టీచర్ కవిత, ఏఎన్ఎం సుకన్య, ఆశా కార్యకర్త పార్వతి, మహిళలు పాల్గొన్నారు.