ఏర్పేడు: అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

శ్రీకాళహస్తి మండలం ఊరందూరు ఎస్టీ కాలనీలో శనివారం కె. రామి రెడ్డి(43) అనే జేసీబీ ఆపరేటర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. కుటుంబ కలహాల కారణంగా పదిరోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయిన ఆయన, తన సొంత పొలంలో విగతజీవిగా పడి ఉండటాన్ని పశువుల కాపరులు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్