బైక్ ను ట్రాక్టర్ ఢీకొని తండ్రి, కొడుకులు మృతి చెందిన విషాద ఘటన బుధవారం రాత్రి తొట్టంబేడు మండలం దొమ్మరపాలెం వద్ద చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం. చియ్యవరం గ్రామానికి చెందిన రాజా (30) తన భార్య, బిడ్డలతో కలిసి బైక్ పై శ్రీకాళహస్తి నుంచి చియ్యవరం వెళ్తుండగా ఎదురుగా వస్తున్న ఇసుక ట్రాక్టర్ బైక్ ను ఢీ కొనడంతో రాజా (30), అతని కుమారుడు చైతన్య (5) మృతి చెందారు. మృతుడి భార్య గురువమ్మకు తీవ్ర గాయాలయ్యాయి.