తిరుపతి రూరల్ కరకంబాడి పంచాయతీ సుందరయ్య కాలనీలో పాఠశాల వైస్ చైర్మన్ పి. రాజశేఖర్, వృద్ధాశ్రమ ఫౌండర్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఉచిత న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ గ్రామీణ పేదల ఆస్తుల తగాదాలు, తప్పుడు కేసులు, మహిళల సమస్యలపై తిరుపతి జిల్లా కోర్టు ద్వారా ఎటువంటి ఫీజు లేకుండా ఉచిత న్యాయ సహాయం, న్యాయవాదుల సేవలు లభిస్తాయని తెలిపారు. అధికారుల నిర్లక్ష్యం, ఆర్థిక ఇబ్బందుల వల్ల న్యాయానికి దూరమవుతున్న పేదలందరూ ఈ ఉచిత అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.