భారత్ క్రికెట్ టీమ్ కోచ్ గౌతమ్ గంభీర్ కు శ్రీకాళహస్తి నియోజకవర్గం రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయంలో స్వాగతం లభించింది. శనివారం శ్రీవారి దర్శనార్థం న్యూఢిల్లీ నుంచి ఎయిర్ ఇండియా విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆయనకు అధికారులు, అభిమానులు స్వాగతం పలికారు. అనంతరం ఆయన రోడ్డు మార్గాన తిరుమలకు బయలుదేరి వెళ్లారు.